సీఎం కేసీఆర్‌ పై ప్రేమతో చిత్ర పటం అందించిన బీఆర్‌ఎస్‌ నేతలు

-

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుని నేటి నుంచి ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును శాసనమండలిలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు ప్రగతి భవన్ లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి, రైతులపై వారికున్న ప్రేమ తెలియజేసే విధంగా వాసు అనే చిత్రకారుడు గీసిన చిత్రాన్ని సీఎం కేసీఆర్ గారికి బహూకరించారు.

రైతు గుండెల్లో కేసీఆర్ ఉంటే కేసీఆర్ గుండెల్లో రైతు ఉన్నాడని భావోద్వేగ పూరిత అర్థం స్ఫురించేలా ఉన్నది.రైతును కేసీఆర్ గుండెల్లో పదిలంగా పెట్టుకుని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో, అదేవిధంగా తన కోసం పనిచేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంతే పదిలంగా, అంతే ప్రేమతో తెలంగాణ రైతన్న గుండెల్లో నిలుపుకున్నాడనే భావాన్ని, రైతుకు సీఎం కేసీఆర్ కు ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రం తెలియజేస్తుంది. చిత్రకారుడిని, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version