లిక్కర్ షాపు లైసెన్స్‌ కోసం నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

-

తెలంగాణలో వైన్ షాపుల లైసెన్స్​కు దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాలానికి రిజర్వుడ్‌ వైన్స్‌ల కేటాయింపు ప్రక్రియ గురువారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాల్లో ఓపెన్‌ క్యాటగిరీలో 1,834 దుకాణాలు ఉండగా.. గౌడ్స్‌, ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలు ప్రభుత్వం కేటాయించనుంది. వీటిల్లో గౌడ్స్‌కు 393 (15 శాతం), ఎస్సీలకు 262 (10 శాతం), షెడ్యూల్డ్‌ ఏరియా ఎస్టీలకు 95, నాన్‌ షెడ్యూల్డ్‌ ఎస్టీలకు 36 ఎస్టీలకు మొత్తం 131 (5 శాతం) చొప్పున కలెక్టర్లు దుకాణాలను రిజర్వ్‌ చేశారు.

2023-25 కాలానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్స్‌ కోసం ఇవాళ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలు పెట్టనున్నారు. ఈ నెల 21న బహిరంగంగా లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఒకే వ్యక్తి రాష్ట్రంలోని ఎకడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, రిజర్వు దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version