BREAKING : కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత..ప్రమాదం పొంచి ఉందా ?

-

నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో కడెం ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు, 7.603 టీఎంసీలుగా నమోదు అయింది. ప్రస్తుత నీటిమట్టం 696.600 అడుగులు,6.100 టీఎంసీలలో కొనసాగుతుంది.

ఇన్ ప్లోగా ప్రాజెక్టులోకి 186000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు 13 వరద గేట్లు ఎత్తి దిగువకు 136000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక కడెం ప్రాజెక్టు కు 1లక్ష 86 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఇదే ఇన్ ఫ్లో కొనసాగినా లేదా పెరిగినా మళ్లీ ప్రమాదంలో కడెం ప్రాజెక్టు ఉండే అవకాశం ఉంది. 4 గేట్లు లేవకపొతే కడెంకు గత ఏడాది పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే కడెం ప్రాజెక్టు వద్ద కు చేరుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్..ప్రాజెక్టు ను పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news