పిడుగు పడి సుమారు 14 నిమిషాల పాటు అలాగే వెలుతురు వచ్చింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లో చోటు చేసుకుంది. భారీ అకాల వర్షానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీ లోని ఖాళీ ప్రదేశములో పిడుగు పడింది.

సుమారు 14 నిమిషాల పాటు అలాగే వెలుతురు నిచ్చింది. ఖాళీ స్థలంలో పడడంతో ఎలాంటి నష్టం జరుగక పోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అటు తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయి.
తెలంగాణకు 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. నల్గొండ జిల్లా అప్పాజీపేటలో మహిళా రైతు భిక్షమమ్మ (46), మహబూబాబాద్ జిల్లా ఓతాయిలో గొర్రెల కాపరి చేరాలు (55), గుడెంగలో ప్రవీణ్ కుమార్ (27) అనే వ్యక్తి, వనపర్తి జిల్లా మియాపూర్లో కొరవ నాగరాజు (18) అనే యువకుడు పిడుపాటుకు ప్రాణాలు కోల్పోయారు.
పిడుగు పడి సుమారు 14 నిమిషాల పాటు అలాగే వెలుతురు
భారీ అకాల వర్షానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీ లోని ఖాళీ ప్రదేశములో పిడుగు పడింది.
సుమారు14 నిమిషాల పాటు అలాగే వెలుతురు నిచ్చింది.
ఖాళీ స్థలంలో పడడంతో ఎలాంటి నష్టం జరుగక పోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు pic.twitter.com/bId0L2xNci— ChotaNews App (@ChotaNewsApp) May 22, 2025