500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషన్ల మీదనే నడుస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల సమస్యల మీద రివ్యూ చేసే సమయం లేదు కానీ అందాల పోటీల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడని చురకలు అంటించారు కేటీఆర్.
వడ్లు కోనేటోడు లేడు, కొన్న వడ్లు తరిలించేటోడు లేడు అడుగుదాం అంటే స్థానిక నాయకులు అసలు పత్తాకే లేరు అంటూ చురకలు అంటించారు కేటీఆర్. మా ప్రభుత్వంలో ఫైల్లు కదలాలి అంటే మంత్రుల చెయ్యి తడపాల్సిందేనని కొండా సురేఖ చెప్పిందఐ గుర్తు చేశారు. మా ప్రభుత్వంలో మంత్రులు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారు ఇంకొక కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పాడని తెలిపారు కేటీఆర్.