ఫార్ములా ఈ – కార్ రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ కేసు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు.
ఈ కేసులో కేటీఆర్ తరఫున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. సుమారు రెండున్నర గంటలకు పైగా కేటీఆర్ తరపు లాయర్ వాదిస్తున్నారు. కేటీఆర్ పై నమోదు చేసిన కేసులో ఎన్నో లొసుగులు ఉన్నాయని, కేసును క్వాష్ చేయాలని సుందరం కోరారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు కేటీఆర్.
14 నెలల తర్వాత కేసు నమోదు చేయడంలోనే రాజకీయ కుట్ర ఉందని అర్థమవుతుందన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లొ కరప్షన్ జరగనప్పుడు పిసి యాక్ట్ కేటీఆర్ కి ఎలా వర్తిస్తుందని లాయర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని అన్నారు ఏజి. ఈ కేసులో కొద్ది సేపట్లో తీర్పు వెల్లడించనుంది హైకోర్టు.