బెట్టింగ్ యాప్ ప్రమోటర్ భయ్యా సన్నీ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ భయ్యా సన్నీ యాదవ్ కోసం గాలిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. ఈ నెల 5 న సన్నీ యాదవ్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీంతో పరారీలో ఉన్నాడు బెట్టింగ్ యాప్ ప్రమోటర్ భయ్యా సన్నీ యాదవ్.

ఈ తరుణంలోనే… బెట్టింగ్ యాప్ ప్రమో టర్ భయ్యా సన్నీ యాదవ్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఏ క్షణమైనా భయ్యా స న్నీ యాదవ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భయ్యా సన్నీ యాదవ్ విదేశా ల్లో ఉన్నట్లు తెలిసిందని సూర్యాపేట డీఎస్పీ రవి వెల్లడించారు. దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే అతడిని అరెస్టు చేస్తామని ప్రకటించారు డీఎస్పీ రవి.