స్టాలిన్ మీటింగ్ లో ఉన్న వాళ్లు అందరూ దొంగలే – బండి సంజయ్

-

స్టాలిన్‌ మీటింగ్‌ కు వెళ్లిన వారందరూ దొంగలే అంటూ సంచలన వ్యాక్యలు చేశారు బండి సంజయ్. తాజాగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. డీఎంకే పెట్టిన మీటింగ్‌ కు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిశాయన్నారు.

bandi sanjay, stalin

నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని బాంబ్‌ పేల్చారు బండి సంజయ్. ఇస్తే వద్దనను.. అధ్యక్షుడిగా ఇప్పటికే నేనేంటో నిరూపించుకున్నానని ప్రకటించారు. కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని ఆగ్రహించారు.. కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దని కోరారు బండి సంజయ్. పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారు.. నేను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నానన్నారు బండి సంజయ్. నియోజకవర్గ పునర్విభజన పై మీటింగ్ పెట్టుకున్న వారు దొంగల ముఠానేనని… డీఎంకె పెట్టిన మీటింగ్ కి‌ కాంగ్రెస్, బిఅర్ఎస్ కలిసి వెళ్ళారని ఆగ్రహించారు. డిలిమిటేషన్ ప్రాసెస్,నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని తెలిపారు బండి సంజయ్.

 

Read more RELATED
Recommended to you

Latest news