Siricilla: కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి !

-

: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించాడు ఓ తండ్రి. ఈ సంఘటన కేటీఆర్‌ ఇలాక అయిన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి అనే వ్యక్తి.. వస్త్ర వ్యాపారం చేస్తూ ఉంటాడు. చిలువేరి మురళి కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నాడు. అయితే.. చిలువేరి మురళి ఇంటి దగ్గర డీజే బ్యాక్సులు పెట్టి..ఒక రోజు బాగా డ్యాన్స్‌ చేశాడు చిలువేరి మురళి కూతురి ప్రియుడు.

lovers jump and marriage

అదే సమయంలో దుబారాగా తిరిగే ఆ కుర్రాడి ప్రేమలో పడింది చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష. ఇంకేముంది… జీవితంలో ఎలాంటి సెటిల్మెంట్‌ లేకుండానే… ముందు చూపు ప్లాన్స్‌ లేకుండానే.. చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష..ప్రియుడితో లేచిపోయింది. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. అయితే… కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news