2023లో 305 రోజుల్లో వాన కురిసింది 66 రోజులే

-

తెలంగాణలో గతేడాది వర్షం చాలా తక్కువ శాంత నమోదైంది. దీంతో భూగర్భ జలాలు పడిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం చెరువులు, జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. వర్షానికి వర్షానికి మధ్య విరామం భారీగా ఉండటంతో రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కటకట పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య 305 రోజులకుగాను కేవలం 66 రోజులు మాత్రమే వర్షాలు కురిసినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ వర్షాలు, వాటి మధ్య భారీ అంతరంతో రాష్ట్రంలో క్షామ పరిస్థితులు తలెత్తాయని తెలిపాయి.

వర్షానికి వర్షానికి మధ్య (కనీసం నాలుగు వారాలు) విరామం రావడాన్ని డ్రైస్పెల్‌గా అంచనా వేస్తారు. డ్రైస్పెల్‌ భూగర్భ జలమట్టంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు. 2023లో నైరుతి రుతుపవన కాలంలో రాష్ట్రంలోని 612 మండలాల్లో మొత్తం 476 డ్రైస్పెల్స్‌ నమోదైనట్లు వెల్లడించారు. ఎక్కువగా సూర్యాపేటలో 37, రంగారెడ్డి 34, సంగారెడ్డి 28, ఖమ్మం 26, నల్గొండ 24, మహబూబాబాద్‌ 22, హైదరాబాద్‌ 20, నాగర్‌కర్నూల్‌ 18, మేడ్చల్‌ మల్కాజిగిరి 17, భద్రాద్రి 16, మంచిర్యాల 16, యాదాద్రిలో 16 డ్రైస్పెల్స్‌ నమోదయ్యాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version