సామాన్యులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదేశాల… సిలిండర్ ధరలను తగ్గించాయి చమురు సంస్థలు. జనవరి ఒకటో తేదీ నేపథ్యంలో… దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు…. పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి కొత్త సంవత్సరం వచ్చిన నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు… అమాంతం తగ్గిపోయాయి.
ఒక్కో సిలిండర్ పైన 14.50 రూపాయలు… తగ్గించాయి చమురు సంస్థలు. అయితే సామాన్య ప్రజలు గృహాల్లో వినియోగించే సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1804 రూపాయలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సిలిండర్ ధర 2014 రూపాయలుగా ఉంది. ఇవాల్టి నుంచి కొత్త ధరలు అమలులోకి రాబోతున్నాయి. అదే సమయంలో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు చమురు సంస్థలు. దీంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.