తెలంగాణ మద్యం అమ్మకాల్లో ఆల్ టైం రికార్డ్.!

-

 

తెలంగాణ మద్యం అమ్మకాల్లో ఆల్ టైం రికార్డ్ నమోదు ఐంది.. డిసెంబర్ 30వ తేదీన ఒక్కరోజే 402 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో 30 ,31 తేదీల్లో 1000 కోట్ల సరకు సరఫరా జరిగింది. 30న 3,82,265 లిక్కర్ కేసులు..3,96,114బీర్ కేసుల అమ్మకాలు జరిగాయి.

Telangana all time record in liquor sales

చలి కాలంలో కూడా లిక్కర్ కంటే బీర్లే అత్యధికంగా విక్రయం జరిగాయి. 31న రాత్రికి రాత్రి మద్యం కొనుగోళ్ళు మరింత పెరిగినట్టు సమాచారం అందుతోంది. 1న రాత్రికి రాత్రి మద్యం కొనుగోళ్ళ లెక్కలు ఇంకా రావాల్సి ఉంది.

కాగా, నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 1,300 మందిపై కేసులు నమోదు చేశారు. పలువురు వ్యక్తులకు 500 పాయింట్ల కంటే ఎక్కువ మద్యం ఉన్నట్టు కూడా ఈ టెస్టుల్లో తేలింది. ఈ డ్రైవ్‌లో ఓ వ్యక్తి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలూకా అని హల్ చల్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news