నటి శోభిత ది ఆత్మహత్యే : మాదాపూర్ డీసీపీ

-

కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసు ఇప్పుడు చర్చగా మారిన సంగతి తెలిసిందే. సూసైడ్ మూడు రోజుల ముందు గోవా కు వెళ్లి వచ్చారు శోభిత ఆలాగే ఆమె భర్త సుధీర్. శోభిత లాస్ట్ కాల్ వాళ్ళ అక్కతో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఆత్మహత్య గల కారణాలు తెలియవు అని వివరణ ఇచ్చారు ఆమె భర్త. ఇక శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు గచ్చిబౌలి పోలీసులు. బెంగళూరులో అంత్యక్రియలకి మరికొద్ది సేపట్లో శోభితా మృతదేహం తరలించనున్నారు కుటుంబ సభ్యులు.

అయితే శోభిత ది ఆత్మహత్యే అని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఇంట్లో సేకరించిన ఆధారాల తో సూసైడ్ గా భావిస్తున్నాం. పోస్టుమార్టం రిపోర్టు లో కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తమవలేదు అన్నారు. ఇక సూసైడ్ నోట్ లభించలేదు. కానీ.. ఆత్మహత్య కు ముందు ఎక్కడైనా డైరీ లో రాసుకుందా, ఎవరికైనా మెసేజ్ చేసిందా అని దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. ఇక భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. శోభిత పేరెంట్స్ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version