మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు హాట్ కామెంట్స్ చేసారు. మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడని ఫైర్ అయ్యారు. పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. మా చెల్లెళ్ళకు మాత్రం రావడం లేదని ఆరోపణలు చేశారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు.

కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డిలకు, గౌడ్లకు పదవులు ఇస్తున్నారు… మొగుళ్ళు పనిచేస్తే పెళ్ళాలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు. మరి మేము పెళ్ళాలము పనిచేస్తున్నాము.. మా మొగుళ్ళకు కూడా పదువులు ఇవ్వండి అని తెలిపారు.
మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు.. ? ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండి అన్నారు. సంవత్సరంన్నర నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి ఇవ్వలేదు.. నన్ను హెరాస్మెంట్ చేయొద్దు.. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోమంటే వెళ్లిపోతానని తెలిపారు.