క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి

-

క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్ – మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. హైదరాబాద్ – మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రెడిట్ కార్డు బిల్లు కోసం వెళ్లిన ఓ ఏజెంట్ పై కుక్కని వదిలారు యజమాని.

Man bitten by dog ​​when asked for credit card bill
Man bitten by dog ​​when asked for credit card bill

జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు కట్టాల్సిన ఉంది.. అయితే రికవరీ చేయడానికి వచ్చిన ఏజెంట్ సత్య నారాయణపై కుక్కను వదలడంతో ఒక్కసారిగా మీద పడి కరిచింది కుక్క. గాయాల పాలైన బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news