రేవంత్ ప్రభుత్వం పై మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీరియస్..!

-

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్న దామరచెరువు ఎల్టీటీఎల్ బఫర్ జోన్లో కాలేజీలు ఉన్నాయి. ఐఏఆర్, ఎంఎల్ఆర్ఎటీఎం కాలేజీ బిల్డింగ్ లు ఇక్కడ ఉన్నాయి. అయితే రాజశేఖర్రెడ్డి.. మొత్తం 8.24 ఎకరాల చెరువును అనగా.. ఎఫ్ఎఎల్ బఫర్ జోన్ ను ఆక్రమించి.. పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. తాజాగా నోటిసులపై ఎలాంటి స్పందన లేకపోవడంతో మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు.

తాజాగా ఈ కూల్చివేతలపై మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తాము ఎవరి భూమిని కబ్జా చేయలేదని అన్నారు. అది మా పట్టా భూమి అని స్పష్టం చేశారు. 25 ఏళ్ల క్రితమే కాలేజీని ప్రారంభించామని తెలిపారు. అక్రమ భవానాలు ఉన్నాయని వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చారని అన్నారు. 25 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తాము నోటీసులకు సమాధానం కూడా ఇచ్చామని.. అయినా 4. కూల్చివేతలు చేయడంతో తమపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో తెలుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ట్యాక్స్ రూపంలో రూ. 15 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version