తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. గురువారం ఆమె మహబూబ్ నగర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన పాలనపై తనకే నమ్మకం లేనట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఎవరైనా ఏక్ నాథ్ షిండేలా మారితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు చేయడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలుగా బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలకే పరిమితం అయ్యారని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని సీరియస్ అయ్యారు. మోడీ చేసిన అభివృద్ధిలో 1.5 శాతం పనిచేసినా రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లే అని అన్నారు. కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వమే రాబోతోందని అన్నారు. 400 లకు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పారు.