కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది : ఖర్గే

-

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం చేవెళ్ల కేవీఆర్ మైదానంలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరుస్తున్నామని, తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా.. ‘సోనియా, రాహుల్ చెప్పిన మాటను అమలు పరచి చూపిస్తారు. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేశారు. అది కాంగ్రెస్ పార్టీ శక్తి. రేపు తెలంగాణకి షా వస్తున్నారు. ఇన్ని ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతాడు. కేసీఆర్ పార్టీకి బీజేపీతో అంతర్గత ఒప్పంది ఉంది. కేసీఆర్ బీజేపీని, బీజేపీ కేసీఆర్‌ని అందుకే ఏం అనడం లేదు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారు. భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఐఐటీ, ఐఐఎం ఇచ్చింది కాంగ్రెస్.” అని ఖర్గే అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version