ఇవాళ కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణం…భక్తులకు కీలక సూచనలు !

-

 

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లికి వెళ్లే భక్తులకు అలర్ట్‌. నేడు ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణం ఉంది. కాశీ పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్యా శివచార్య మహా స్వామి ఆధ్వర్యంలో 108 మంది వీర శైవ పండితులచే కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగనుంది. ఈ తరుణంలోనే… ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ లు.

Mallikarjuna Swami Kalyanam today in Komuravelli

మూడు నెలల 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కళ్యాణంతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లన్న కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా తరలిరానున్నారు భక్తులు. ఇక కొమురవెల్లి లో మల్లికార్జున స్వామి కళ్యాణం ఉన్న తరుణంలోనే… ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news