పెట్ డాగ్ ను చంపాయని రివేంజ్.. 20 వీధికుక్కలను కాల్చిచంపిన ముగ్గురు అరెస్టు

-

పెంచుకుంటున్న కుక్కను కరిచి చంపాయని ఓ వ్యక్తి స్నేహితులతో కలిసి 20 వీధికుక్కలను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ అమానవీయ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామంలో నెల క్రితం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఎస్పీ హర్షవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఉంటున్న మంద నర్సింహారెడ్డి(57)కు ఫలక్‌నుమాకు చెందిన తారీఖ్‌ అహ్మద్‌(42), మహ్మద్‌ తాహెర్‌(40) మిత్రులు. నర్సింహారెడ్డి అత్తగారి ఊరైన అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామంలో డాక్స్‌హుండ్‌ జాతి రకం పెంపుడు కుక్కలున్నాయి. అందులో ఒకదాన్ని ఆ గ్రామంలోని వీధి కుక్కలు కరిచి చంపడంతోపాటు మరోదాన్ని గాయపరిచాయి. విషయం తెలుసుకున్న నర్సింహారెడ్డి ఫిబ్రవరి 15న తతన స్నేహితుడు తారిఖ్‌ అహ్మద్‌ వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో గ్రామంలో కనిపించిన కుక్కలన్నింటినీ కాలుస్తూ వెళ్లారు. ఈ ఘటనలో 20 మూగజీవాలు మరణించాయి. పంచాయతీ కార్యదర్శి విజయ రామరాజు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version