తెలంగాణలో ఏప్రిల్‌1 నుంచి ధాన్యం కొనుగోళ్లు!

-

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెల (ఏప్రిల్‌) 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే వరి కోసిన రైతులు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నారు.

కొంతకాలంగా బియ్యం ధరలు పెరుగుతుండటంతో కొందరు రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం పరిమాణం తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. మరోవైపు పౌర సరఫరాల శాఖ అధికారులతో 21వ తేదీన రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనుంది. ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది రైతుల వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజ సేకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version