భార్యను చంపి.. ఠాణాకు వెళ్తుండగా.. లారీని ఢీకొని భర్త మృతి

-

నాలుగు నెలల క్రితమే పెళ్లి జరిగింది. పెళ్లయినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఆ భర్త. రోజురోజుకు ఆ అనుమానం పెరిగి పెనుభూతమైంది. చివరకు ఆమెను కిరాతకంగా హతమార్చే వరకు తీసుకువచ్చింది. అలా భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయేందుకు వెళ్తున్న ఆ వ్యక్తి లారీని ఢీకొట్టిన మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణానికి సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అనుమానంతో శుక్రవారం తెల్లవారు జామున దీపను అరుణ్‌ హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయేందుకు బయల్దేరాడు. అలా ద్విచక్ర వాహనంపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తున్న క్రమంలో ఖుర్షిద్‌ నగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని అరుణ్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version