ఆ హీరోతో 14 భాషల్లో అనుష్క సినిమా

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాజాగా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే అనుష్క స్పీడ్ పెంచేసింది. మరో పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించింది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల చేసింది చిత్ర బృందం.

‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’ (Kathanar – the wild sorcerer) పేరుతో రానున్న ఓ హారర్‌ సినిమాకు అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర అరుంధతి తరహాలో ఉంటుందని సమాచారం. రోజిన్ థామస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా మొత్తం 14 భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version