ఈ నెల 30న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం

-

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన  ఊరు-మనబడి’, ‘మనబస్తీ-మనబడి’ కార్యక్రమ ఫలితాలు అందివస్తున్నాయి. ఈ పథకం కింద తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,240 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల సదుపాయాలు కల్పించారు.

ఆయా పాఠశాలలను ఈ నెల 30న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ వాతావరణంలో జరగనున్న ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి ముఖ్య మంత్రి కేసీఆర్ 2022 మార్చి 8న వనపర్తిలో శ్రీకారం చుట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version