మంచు విష్ణు పై ట్రోలింగ్.. కౌంటర్ వేసిన యాంకర్ విష్ణు ప్రియ..!

-

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు విష్ణు పై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మీమ్స్ లో మంచు ఫ్యామిలీ ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మా ఎన్నికల సమయం.. సన్నాఫ్ ఇండియా.. జిన్నా సమయాల్లో కూడా మంచు ఫ్యామిలీ మీద జరిగినంత ట్రోలింగ్ మరెప్పుడూ ఎవరి మీద జరిగి ఉండదు. మంచు విష్ణు తన డైట్, జిమ్ గురించి చెబుతూ మాట్లాడిన మాటలు మీద కూడా విష్ణు ప్రియ కౌంటర్లు వేశారు. ఇకపోతే గతంలో విష్ణు మాట్లాడుతూ.. నేను సరిగ్గా డైట్ ప్లాన్ చేసి.. వర్కౌట్ చేస్తే మిస్టర్ ఇండియా అవుతానంటూ చేసిన కామెంట్లపై విష్ణు ప్రియ స్పందించింది.

 

రెండు రోజులు జిమ్ కు వెళ్లిన ఫ్రెండ్ ఇలా మాట్లాడుతాడు అంటూ మీమ్ వీడియో వైరల్ గా సాగింది. దానిపై విష్ణు ప్రియ కౌంటర్ వేస్తూ.. “నేను కూడా మిస్ ఇండియా అవుతాను” అంటూ నవ్వేసింది.. అంటే విష్ణు ప్రియ కూడా ఒక రెండు రోజులు జిమ్ చేసి ఇలా బిల్డప్ ఇస్తుందని చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే విష్ణు ప్రియ మాత్రం గత రెండు సంవత్సరాలుగా వర్కౌట్ చేస్తూనే ఉంది. అలాగే జిమ్ లో కష్టపడుతూనే తన ఫిజిక్ లో మార్పులు తీసుకురావడానికి తెగ కష్టపడుతోంది. ముఖ్యంగా జంపింగ్లు చేస్తూ.. స్టంట్ లో ట్రైనింగ్ పొందుతోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్న ఈమె సినిమాలలో అవకాశాలు వస్తే కాదనకుండా చేస్తోంది. మానస్ తో కలిసి చేసిన జరీ జరీ పంచకట్టు ప్రైవేటు ఆల్బమ్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ జంటకు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు మొత్తానికైతే విష్ణు ప్రియ.. మంచు విష్ణు పై చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version