HYD: ఓయో రూంల్లో సీక్రెట్‌ కెమెరాలు..నగ్న వీడియోలు తీసి..!

-

శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాహకం బయటపడింది. ఓయో లాడ్జి లో సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. శంషాబాద్ లోని సిటా గ్రాండ్ ఓయో హోటల్ నిర్వాహకుడు గణేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సిటా గ్రాండ్ ఓయోకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు యువత. ఈ తరుణంలోనే.. హోటల్ రూం లలో సీసీ కెమెరాలు పెట్టి అశ్లీల దృశ్యాలు రికార్డ్ చేస్తున్నాడు గణేష్. ఇక ఆ వీడియోలను ఆ జంటలకు చూపించి.. బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడట.

Manager of Manager of OYO Hotel in Shamshabad

బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నాడు గణేష్. బల్బ్ హోల్డర్ లలో కెమెరాలు ఫిక్స్ చేశాడు గణేష్. సీసీ కెమెరాలు గమనించిన ఓ జంట.. గణేష్ ను నిలదీయడంతో అసలు విషయం..బయటపడింది. హోటల్ పై రైడ్ చేసిన పోలీసులు.. 2 సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. గణేష్ ఫోన్ లో అశ్లీల వీడియోలు, యువతుల ఫోటోలు గుర్తించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version