హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఎన్వీఎస్ రెడ్డిని హైదరాబాద్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2023-24 అవార్డుతో ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ పురస్కారాన్ని ఎన్వీఎస్ రెడ్డికి ప్రదానం చేశారు.
ప్రతి ఏడాది హెచ్ఎంఏ మాజీ ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ పేరిట జీవిత సాఫల్య పురస్కారాలు, ఎంఎస్ఎన్ గ్రూపు ఎంటర్ వ్యూనర్ ఆఫ్ ది అవార్డు, సీయెంట్ లిమిటెడ్ సీఎస్ఆర్ పేరుతో పురస్కారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి మెట్రో ఎండీని ఘనంగా సత్కరించారు. అనేక ప్రభుత్వ సంస్థల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయల ప్రాజెక్టులను ఎన్వీఎస్ రెడ్డి విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వహణలో సాధించిన విజయాల పరంపరలో మెట్రో స్టేషన్లపై సౌరఫలకాల ఏర్పాటు ద్వారా ప్రాజెక్టుకు అవసరమైన 12 శాతం విద్యుత్ ఉత్పత్తి, కర్బన ఉద్గారాలను 3.34 లక్షల టన్నుల వరకూ తగ్గించారని హైదరాబాద్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ కొనియాడింది.