మీడియా పై మోహన్ బాబు దాడి..!

-

జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అలాగే ఆయన సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఆవేశంతో ఊగిపోయారు మోహన్‌బాబు. అనంతరం మీడియా ప్రతినిధుల మైక్ తీసుకొని మోహన్ బాబు దాడి చేయగా.. మోహన్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేసారు. దాంతో మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అయితే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే మొదట పోలీస్ అధికారులను కలిసి ఇంటికి వచ్చిన మనోజ్ దంపతులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు బౌన్సర్లు. గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పెట్టడంతో.. చాలా సేపు గేటు బయట కార్లో ఉండిపోయారు మనోజ్ దంపతులు. 7 నెలల పాప లోపలే ఉందని ఆందోళన వ్యక్తం చేసిన మౌనిక.. గేట్లను తోసుకుని లోపలికి వెళ్లారు మనోజ్ దంపతులు. అయితే ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version