మనోజ్ నిన్ను కనడమే నేను చేసిన పాపమా..? : మోహన్ బాబు

-

 మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. మనోజ్ జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.తన కుమారుడు మనోజ్, కొడల్ మౌనిక తో గొడవల నేపథ్యం లో   సినీ నటుడు నటుడు ఆడియో రూపంలో మాట్లాడారు.

“నిన్ను ఎలా పెంచునురా.. బిడ్డలు గుండెల్లో తన్నిన్నటు తన్నావు. ప్రతి ఫ్యామిలీ లో గొడవలు ఉంటాయి. నీకు అన్నీ ఇచ్చినా, నాకు ఆపకీర్తి తెచ్చావ్. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావ్. నువ్వు, నీ భార్య చేస్తుంది భగవంతుడు చూస్తున్నాడు. ఇంట్లో ఉన్న పని వాళ్లను ఎందుకు కొడుతున్నావ్. మూడు రోజులు నుంచి జరుగుతుంది చూడు. మీ అన్న కష్టపడి యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాడు. మీ అన్నను కొడతావ్, తిడతావ్. మీ అన్నను చంపుతా అన్నావ్. ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత లేదు” అని మంచు మోహన్ బాబు ఆడియోలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version