విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2,400 మెగావాట్ల విద్యుత్కేంద్రం కరెంటు కావాలా.. వద్దా అని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ రాష్ట్ర విద్యుత్‌శాఖను ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటో జులై ఆఖరులోగా తేల్చి చెప్పాలని సూచించారు. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్కేంద్రాల నిర్మాణంపై ఆయన తాజాగా దిల్లీలో సమీక్ష జరిపారు.
ఈ సమీక్షలో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించే కొత్తప్లాంటు గురించి లోతుగా చర్చ జరిగింది. ఉమ్మడి ఏపీ విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల ప్లాంటును తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 1,600 మెగావాట్ల ప్లాంటును ‘తెలంగాణ విద్యుత్కేంద్రం’ పేరుతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించింది. దీన్నుంచి రోజుకు 3 కోట్ల యూనిట్ల కరెంటును తెలంగాణ సరఫరా చేస్తోంది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంటును కూడా నిర్మించనున్నామని, దీన్నుంచి ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)’ చేసుకుంటారా.. లేదా.. చెప్పాలని గతంలో ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్‌శాఖకు లేఖ రాసింది.