రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి మావోయిస్టులు వార్నింగ్‌..లేఖ విడుదల ?

-

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి మావోయిస్టులు వార్నింగ్‌ ఇస్తూ లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో లేఖ విడుదల అయింది. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు మావోలు. ఈ నెల 20 న జరిగే 43 ఏళ్ళ ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరొత్సాహంతో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసుల హక్కులను అమలు చేసి, అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ సర్కార్‌ ను డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు.

Maoists warning to Revanth Reddy government

ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలను దెబ్బతీస్తూ ఆదివాసీ గ్రామాలలో హిందుత్వ శక్తులు నిర్మిస్తున్న రామమందిరాలను వెంటనే నిలిపివేయాలన్నారు. ఆదివాసీ సంస్కృతి కాపాడాలని డిమాండ్ చేసారు. అడవిని ధ్వంసం చేస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను, ఇతర గనులను పెద్ద ప్రాజెక్టులను రద్దు చేయాలన్నారు. 29 శాఖల్లో ఉన్న జీవోలను చట్టం చేసి… ఆ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను ఆదివాసీలను నియమించాలని డిమాండ్‌ చేశారు. అదివాసీ గ్రామాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కారించాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఆదివాసీలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు మావోయిస్టులు.

Read more RELATED
Recommended to you

Latest news