నేడు మేడారానికి కేసీఆర్… సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్న సీఎం

-

మేడారం సమ్మక్క-సాలరమ్మలు గద్దెలపై కొలువైనారు. నిన్న చిలకల గుట్ట నుంచి అట్టహాసంగా సమ్మక్క తల్లిని.. ఆదివాసీ పూజారులు తీసుకువచ్చి.. గద్దెలపై ప్రతిష్టించారు. దీంతో నేడు మేడారంలో పెద్ద ఎత్తున దర్శనాలు జరగనున్నాయి. లక్షల్లో భక్తులు వచ్చి తమ అమ్మవార్లకు మొక్కులను చెల్లించనున్నారు. మేడారం మొత్తం జనసంద్రంగా మారనుంది.

ఈరోజు సమ్మక్క-సాలరమ్మ తల్లులను దర్శించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం వెళ్లనున్నారు. అక్కడే మేడారం జాతరపై, అభివ్రుద్ధిపై సమీక్షించనున్నారు. సతీసమేతంగా తల్లులను దర్శించుకోనున్నారు. మేడారంలో సీఎం పర్యటనే సందర్బంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

మరోవైపు ఈరోజు ఒక్క రోజే.. సమ్మక్క- సారలమ్మలు దర్శనం గద్దెలపై దర్శనం ఇవ్వడంతో మేడారానికి అన్ని ప్రాంతాల నుంచి భక్తల రద్దీ పెరిగింది. మేడారానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. చత్తీస్గడ్, ఒడిషా, మహరాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మేడారానికి కొన్ని కిలో మీటర్ల వరకు ఖాళీ లేకుండా జనాలతో నిండి ఉన్నారు. వనారణ్యం మొత్తం జనారణ్యంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version