కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి… మొదటి ప్రమాద హెచ్చరిక!

-

భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,19,500 క్యూసెక్కులుగా ఉంది. దింతో 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Medigadda Lakshmi Barrage inflow, outflow 8,19,500 cusecs
Medigadda Lakshmi Barrage inflow, outflow 8,19,500 cusecs

కాళేశ్వరం త్రివేణి సంగమం జ్ఞాన సరస్వతి పుష్కరఘాట్ వద్ద జ్ఞానదీపాలు నీట మునిగాయి. ములుగు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13.990 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉంది. పేరూరు వద్ద 14.440 మీటర్ల ఎత్తులో గోదావరి వరద ఉంది. ములుగు జిల్లాలో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ఉధృతిగా ఉంది. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,42,150 క్యూసెక్కులు గా నమోదు అయింది. 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news