HCU భూముల అంశంపై మీనాక్షి నటరాజన్ షాకింగ్ ప్రకటన చేశారు. హెచ్‌సీయూ భూముల అంశంపై కమిటీ వేశామన్నారు మీనాక్షి నటరాజన్. దేశంలో పర్యావరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. హెచ్‌సీయూ భూముల అంశంపై ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలతో కమిటీ వేశామని వెల్లడించారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్.

ఏక పక్షంగా కాకుండా 360 డిగ్రీలలో అందరి వాదనలు వింటామని వెల్లడించారు. ఎవరికి నష్టం జరగకుండా వివాదం పరిష్కారం చేయాలనేది మా ఆలోచన అన్నారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు.