మందు బాబులకు షాక్.. నేడు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నేడే శ్రీ రామనవమి పండుగ. భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే పవిత్రమైన పర్వదినం శ్రీరామ నవమి. శ్రీరాముడు జన్మించిన రోజు ఈ పండుగను ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం. ధర్మం, న్యాయం, సత్యం, ప్రేమలకు ఆయన ప్రతిరూపం. అందుకే శ్రీరాముడిని ఆదర్శ పురుషుడిగా కొలుస్తారు.

శ్రీరామనవమి రోజున ప్రజలు ఉపవాసం ఉండి, రామాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. రాముల వారి కళ్యాణం జరుపుతారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూత పడనున్నాయి.
ఈ మేరకు ఇవాళ వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిసనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఉదయం 10 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నట్టుగా పేర్కొన్నారు. నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర ఉండడంతో శాంతిభద్రతలు పరిరక్షించడంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.