ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి నెల మొదటివారంలో పట్టణాలు, గ్రామాల్లో సభలు నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలా చేస్తే ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఆయా దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో వారికి తెలపాలని విజ్ఞప్తులు, ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలన్నారు.
అలాగే, తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు జడ్ ప్లస్ భద్రత ని తొలగించి y క్యాటగిరి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వై కేటగిరి అంటే కేసీఆర్ కు 4ప్లస్ 4 గన్ మెన్లతో పాటు ఇంటి దగ్గర కూడా సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్ కోసం ప్రభుత్వం ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే మాజీ మంత్రులుగా కొనసాగి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2ప్లస్ 2 భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది.