వికారాబాద్ ను ఎకో టూరిజం స్పాట్ గా చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వికారాబాద్ ను ఎకో టూరిజం స్పాట్ గా చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి కావల్సింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వాల హయాంలో టూరిజం నిర్లక్ష్యానికి గురైందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తమ సర్కార్ లో టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం డెవలప్ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.