దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 కావాలంటే..కాంగ్రెస్‌ రావాలి – మీరాకుమార్

-

దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 కావాలంటే..కాంగ్రెస్‌ రావాలంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు లోక్ సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీరా కుమార్. తెలంగాణ ఆశయాలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరారు. తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కోట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్.

merakumar

తెలంగాణ అన్ని వర్గాల ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలంటే తెలంగాణ ఆశయాలు తెలిసిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపు నిచ్చారు లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశాయాలు కాంగ్రెస్ కు మాత్రమే తెలుసు అన్నారు లోక్ సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీరా కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version