అక్టోబర్‌ లో 7 లక్షల మంది రైతులకు వ్యవసాయ పనిముట్లు – సీఎం జగన్‌

-

అక్టోబర్ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. స్ప్రేయర్లు, టార్పాలిన్లు.. ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో ఆ 7 లక్షల మంది రైతన్నలకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించగా.. వైఎస్సార్ యంత్ర సేవ-2 పథకాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు.

చుట్టుగుంట సెంటర్‌లో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేసిన సీఎం జగన్‌.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2551 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్ల పంపిణీ చేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లయితేనేమి, వ్యవసాయ పరికాలైతేనేమి.. ఇటువంటివన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఆ రైతన్నలే గ్రూపు కింద ఫామ్ అయ్యి, ఆర్బీకే పరిధిలో ఉన్నమిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version