కోల్కత్తాలో యువ పీజీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళన, నిరసనలకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల OP సేవల బంద్ కు పిలుపు ను ఇవ్వడంతో రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు వైద్య సేవలు అంతరాయం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. అయితే రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రజలకు వైద్య పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కు శ్రీకారం చుట్టింది.