మిస్టర్ బచ్చన్ లో 13 నిముషాలు కట్..!

-

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో అభిమానుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ మాత్రం అంతంతంగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబధించిన కొన్ని పాటలు, సన్నివేశాల విషయంలో సోషల్ మీడియా నుండి ఎక్కువగా నెగిటివిటి వచ్చింది. ఈ సినిమాలో పాత పాటలు చాలా ఎక్కువ అయ్యాయని చాలా మంది సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

దాంతో ఈ విషయంలో మిస్టర్ బచ్చన్ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. బయట నుండి వచ్చిన మొత్తం ఫీడ్‌బ్యాక్ తీసుకొని మిస్టర్ బచ్చన్ సినిమాలో ఇప్పుడు 13 నిముషాలు ట్రిమ్ చేయడం జరిగింది అని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news