గాంధీ ఆస్పత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీలు

-

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో బెడ్లు వివరాలు, ఓపీ రోజువారీగా వివరాలు సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి ఆకస్మిక తనిఖీ వివరాలు తెలుసుకున్న వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషనల్ డాక్టర్ వాణి హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.ఆస్పత్రిలో ప్రస్తుతం ఎంతమంది డాక్టర్లు డ్యూటీలో ఉన్నారని సమాచారం అందించాల్సిందిగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు.నర్సింగ్ సిబ్బంది, డయాగ్నొస్టిక్, క్లినికల్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version