ట్యాంక్‌ బండ్‌లో గణపతి నిమజ్జనం.. హైకోర్టులో విచారణ వాయిదా!

-

ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గణేశ్ నిమజ్జనం నగరంలోని ట్యాంక్ బండ్‌లో చేయాలా? ఎక్కడ చేయాలనే విషయంపై చర్చ మొదలైంది. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు చేసే విషయంపై తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరంలో భారీ వర్షాలు కురుస్తుండగా ఇప్పటికే పలు చెరువులు, కుంటలు, ట్యాంక్ బండ్ నిండుకుంది. అయితే, నిమజ్జనం అనంతరం ట్యాంక్ బండ్ పరిసరాలు అధ్వాన్నంగా తయారవుతాయని, అందులో పీవోపీ డస్ట్ మొత్తం పేరుకుపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం నగరంలో మినీ పాండ్లను నిర్మించింది.

తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ఆశ్రయించింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి పెంచడం సరికాదని సూచించింది. ఇప్పటికే గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నందున వాటిని పరిశీలిస్తామని పేర్కొంటూ ఈ నెల 9వ తేదీకి విచారణను వాయిదా వేసింది. కాగా, గతేడాది ఖైరాతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ట్యాంక్ బండ్‌లోనే జరిగిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version