సింగరేణి కార్మికులకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే : దామోదర రాజనర్సింహ

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాం అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నాం. ఇక మహిళా సాధికారత అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా భుజస్కందాల పై వేసుకుంది అని తెలిపారు మంత్రి. ఇందిరా గాంధీ హయం లో పేదలకు భూములు పంచిన గంత కాంగ్రెస్ ది. కానీ గత 10సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక గుంట భూమి, ఒక ఇల్లు కూడాప్రజలకు ఇవ్వలేదు అని స్పష్టం చేసారు.

అయితే సింగరేణి కార్మికులకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పై ఉంది. అలాగే గురుకుల విద్యార్థులకు 40% డైట్ చార్జీలు,100% కాస్మొటిక్ చార్జీలు పెంచాం అని చెప్పిన దామోదర రాజనర్సింహ.. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నియంత, నిరంకుశ పాలన చూశాం అన్నారు. కానీ మేము ప్రజల యొక్క ప్రతి ఆకాంక్షను నెరవేరుస్తాం అని పేర్కొన్నారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version