వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను చదువుకోవాలని ప్రధానికి సూచించారు ఒవైసీ. ఇంతకు ప్రధాని మోడీకి రాజ్యాంగ పాఠాలు చెబుతున్నది ఎవరు..? అని ప్రశ్నించారు. తాజాగా లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మత స్వేచ్ఛ ఉందని చెబుతోంది. మతపరమైన, స్వచ్ఛంద సేవా పరమైన కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందన్నారు.
“మీకు లోక్ సభలో బలం ఉంది కదా అని వక్ఫ్ ఆస్తులను బల ప్రయోగంతో దోచేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ లక్ష్యం అదే” అని ఆరోపించారు ఒవైసీ. బీజేపీ భుజానికి ఎత్తుకున్న జాతీయవాదం అనేది సాంస్కృతిక పరమైంది. కాదని.. అది మతమైందని వ్యాఖ్యానించారు. మసీదుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి.. మూకదాడులు చేయించి.. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు అసదుద్దీన్.