ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు మంత్రి హరీష్ రావు. సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న సేవలు అమూల్యం అని కొనియాడారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో విపత్తు నిర్వహణ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ, అరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు అభినందనీయం అన్నారు.
వానలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిలను సీఎం కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరదలు, ముంపు ప్రాంతాల్లో తీసుకోవలసిన అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి అభినందనలు. సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న సేవలు అమూల్యం.
సీఎం కేసీఆర్ గారి నిరంతర పర్యవేక్షణలో విపత్తు నిర్వహణ, పోలీసు, మున్సిపల్,… pic.twitter.com/dKvaullzi8
— Harish Rao Thanneeru (@BRSHarish) July 28, 2023