ధనిక రాష్ట్రం అని ఊదరగొట్టి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు కేసీఆర్ : మంత్రి జూపల్లి 

-

ధనిక రాష్ట్రం అని ఊదరగొట్టి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు కేసీఆర్ అని  మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలన  పది సంవత్సరాలల్లో రైతుల గురించి పట్టించుకోలేదు. పదేళ్ల నుంచి ఏ రోజైనా రైతులకు పంట నష్టం ఇచ్చారా..? బీఆర్ఎస్ హయాంలోనే వర్షాకాలం వచ్చింది. పంట నష్టం, వరద నష్టం, కరువు ఇవ్వలేదు. రైతులకు వివిధ రకాల సౌకర్యాలను గతంలో కల్పించింది.

ఈ పదేళ్లలో ఎంత మంది రైతులకు పంట, కరువు, వరద నష్టం కట్టించారని ప్రశ్నించారు. గద్దల్లెక్క పదేళ్లుగా వాలి రాష్ట్రానికి అప్పుల కుప్పగా మార్చారు. మళ్లీ ఇవాళ రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కార్చుతున్నారు.  అయినప్పటికీ మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలల్లో 5 గ్యారెంటీలను ఇస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు గద్దల్లా రాష్ట్ర ఖజానాను తన్నుకుపోయారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version