పర్యాటక భవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్ లో అటెండెన్స్ ను పరిశీలించిన మంత్రి జూపల్లి… సమయ పాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రతీ ప్లోర్ ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అడిగిన మంత్రి జూపల్లి… ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. హాజరు శాతం, ఉద్యోగులు పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానన్న మంత్రి జూపల్లి వెల్లడించారు. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు, క్రింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అటు మొలచింతలపల్లి చెంచు మహిళపై పాశవిక దాడి ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. అమానవీయ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి… బాధిత మహిళలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.