కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలోనే కాదు.. బెంగళూరు కూడా డిసైడ్ అవుతున్నాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీలను బెంగళూరుకు తరలిస్తారు. ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తున్నా కొంతమంది అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మెళనంలో మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది.
2014కి ముందు కరెంట్, సాగునీటి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి. దళితబంధు లాంటి పథకాన్ని పెట్టాలంటే దమ్ముండాలి. ఫార్మర్ ఫస్ట్ అనేదే మా నినాదం అని పేర్కొన్నారు. అందుకే 24 గంటల ఫ్రీ కరెంట్, రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఒక్క కేసీఆర్ కొట్టడానికి అందరూ ఏకం అవువుతున్నారు. మనం పనిని, ప్రజలను నమ్ముకున్నామని తెలిపారు కేటీఆర్. సీఎం కేసీఆర్ కి తెలంగాణ శ్రీరామ రక్ష అన్నారు. ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరుకు రావాలని డీకే శివకుమార్ లేఖ రాసారని తెలిపారు కేటీఆర్. సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణకు ఎంత ముప్పు వస్తుందో డీకే లేఖ ద్వారానే తెలుస్తుందన్నారు కేటీఆర్.