తెలంగాణలో ఇవాళ 2023కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉంది. ఇప్పటికే 65 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. బీఆర్ఎస్ 39 స్థానాల్లో ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వైపే గాలి వీచింది. తెలంగాణలో బీఆర్ఎస్ మంత్రులు చాలా మంది ఓటమి పాలయ్యారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో విజయం సాధించారు. విజయం సాధించిన అనంతరం ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేశారు. రెండుసార్లు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటాను. నేటి ఫలితం గురించి అస్సలు బాధపడటం లేదు. కానీ మేము ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కాస్త నిరాశ చెందాను. దీనిని మేము అభ్యాసంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు మంత్రి కేటీఆర్.